నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతర్చేడ్ గ్రామంలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ హరిచందన పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డ్, నర్సరీలను ,ఇంకుడు గుంతలను పరిశీలించారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలు తీసుకునే డబ్బులకు న్యాయం చేసేలా పనిచేయాలని అన్నారు.
ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - హరితహారం
నారాయణపేట జిల్లాలోని పాతర్చేడ్ గ్రామంలో జిల్లా పాలనాధికారి హరిచందన పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులతో పాటు డంపింగ్యార్ట్, నర్సరీలు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
త్వరలోనే హరితహారం ప్రారంభమవుతుందని, మొక్కలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: హైలెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు