నారాయణపేట జిల్లాలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆర్డీవో శ్రీనివాసులుతో కలిసి జిల్లా కలెక్టర్ హరిచందన పర్యటించారు. వరుస వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉండడం వల్ల ప్రజలను అప్రమత్తం చేశారు.
కృష్ణా నదిలోకి ఎవరూ వెళ్లొద్దు: కలెక్టర్ - Narayanapet district news
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ హరిచందన పర్యటించారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉండడం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి రెండు లక్షల 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల అవుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున నదీ పరివాహక ప్రాంతమంతా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లోని వీఆర్ఏ, వీఆర్వోలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకూడదని, చేపలు పట్టేందుకు కూడా అనుమతి లేదని మత్స్యకారులకు సూచించారు.
ఇదీ చూడండి :'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'