తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే.. కఠిన చర్యలే'

నారాయణపేట జిల్లా దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్​ఫోర్స్ పోలీసులు 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

naarayanapeta task force police caught ration rice
నారాయణపేటలో పీడీఎస్ బియ్యం పట్టివేతనారాయణపేటలో పీడీఎస్ బియ్యం పట్టివేతనారాయణపేటలో పీడీఎస్ బియ్యం పట్టివేతనారాయణపేటలో పీడీఎస్ బియ్యం పట్టివేత

By

Published : Sep 17, 2020, 1:06 PM IST

నారాయణపేట జిల్లా దామరగిద్ద పోలీస్ స్టేషన్​ పరిధిలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్​తో పాటు మరో ఇద్దర్ని పట్టుకున్నారు.

కర్ణాటక నుంచి గురుమిట్కల్​కు తరలిస్తున్న క్రమంలో కన్కుర్తి శివారులో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దామరగిద్ద పీఎస్ పరిధిలో ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details