తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 10బెడ్​ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్​ - తెలంగాణ వార్తలు

కొవిడ్ కట్టడికి ప్రతి జిల్లాలో 10 పడకలతో కూడిన ఐసీయూ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీవోల గ్రూప్ నిర్వహిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి క్రిటికల్ కేర్ ఐసీయూ యూనిట్​ను నారాయణపేట్ జిల్లాలో వర్చువల్​గా ప్రారంభించారు.

KTR: 10బెడ్​ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్​
KTR: 10బెడ్​ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్​

By

Published : Jun 5, 2021, 8:17 PM IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొవిడ్ కట్టడికి ప్రతి జిల్లాలో 10 పడకలతో కూడిన ఐసీయూ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీవోల గ్రూప్ నిర్వహిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి క్రిటికల్ కేర్ ఐసీయూ యూనిట్​ను నారాయణపేట్ జిల్లాలో వర్చువల్​గా ప్రారంభించారు.

మూడో వేవ్, తదనంతరం వేవ్​లు తట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని... గత ఏడు సంవత్సరాల్లో 1600 ఐసీయూ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా ఇప్పటికే ఏర్పడ్డాయని, మరో 7 కొత్తవి రానున్నాయని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:Komatireddy: 'ఈటల వ‌ర్గీయుల‌ను కాదు... ధాన్యం కొనండి'

ABOUT THE AUTHOR

...view details