గాంధీజీ.. అహింసా మార్గంలో ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. విద్యార్థులంతా.. మహత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో గాంధీ 150 జన్మదినం పురస్కరించుకొని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి హాజరయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పదిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 150వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించాలని కోరారు.
'గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం' - కలెక్టర్ వెంకట్రావు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో గాంధీ 150 జన్మదినం పురస్కరించుకొని శాంతి సమావేశం నిర్వహించారు.
'గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం'