రైతుబంధు కోసం పట్టాదారు పాసుపుస్తకానికి ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోని రైతుల కోసం కేవైసీ గ్రామసభలను ఏర్పాటు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. జిల్లాలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కేవైసీ కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం చేసుకోని.. రైతులు, వలసలు వెళ్లిన వారికి ఉపయోగపడతాయని పాలనాధికారి వివరించారు.
రైతుల కోసం కేవైసీ కేంద్రాలు
పట్టాదారు పాసుపుస్తకానికి ఆధార్ అనుసంధానం చేసుకోని రైతులు.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేవైసీ గ్రామసభల ద్వారా లింక్ చేసుకోవచ్చని నారాయణపేట జిల్లా కలెక్టర్ తెలిపారు.
రైతుల కోసం కేవైసీ కేంద్రాలు
ఇవీచూడండి: పోక్సో చట్టం సవరణలకు లోక్సభ ఆమోదం