నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లో కృష్ణానది ఉద్ధృతి పలు గ్రామాలను చుట్టుముట్టింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలను, ఇళ్లను వరదనీరు చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. మక్తల్ మండలంలోని ప్రధాన ఆలయాలు, పసుపుల దగ్గర వల్లభాపురం, కుర్మిగడ్డ, ముస్లైపల్లి, నారదగడ్డ ఆలయాలను చుట్టుముట్టింది. కృష్ణ మండలంలోని హిందూపూర్, భీమాశంకర్ ఆలయం, దత్తాత్రేయ ఆలయాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
జలదిగ్బంధంలో కృష్ణానది పరివాహక ప్రాంతాలు
నారాయణపేట జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదీ పరివాహాక ప్రాంతాలలోని ప్రధాన ఆలయాలను, ఇళ్లను వరదనీరు చుట్టుముట్టింది. తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు కూడా వరదనీటిలో చిక్కుకున్నాయి.
మక్తల్
ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం
Last Updated : Aug 11, 2019, 10:26 AM IST