తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాకు తెరాస, ఎంఐఎం పార్టీలు ఏజెంట్లు: జైరాం రమేశ్

Jairam Ramesh on Bharat Jodo Yatra: కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలో తెరాస నియంత పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటుందని.. రాహుల్ గాంధీ జోడో యాత్రతో రాష్ట్రంలో, దేశంలో కీలక రాజకీయ మార్పులు తథ్యమని జైరాం రమేశ్‌ జోస్యం చెప్పారు. భారత్​ జోడో యాత్రకు సామాన్యుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు.

Jairam Ramesh
Jairam Ramesh

By

Published : Oct 27, 2022, 4:51 PM IST

Jairam Ramesh on Bharat Jodo Yatra: తెలంగాణలో భాజపాకు తెరాస, ఎంఐఎం పార్టీలు ఏజెంట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ ఆరోపించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ కు సామాన్యుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల మీదుగా పాదయాత్ర కొనసాగిందని చెప్పారు. పాదయాత్ర 50వ రోజును పురస్కరించుకుని నారాయణపేట జిల్లా మక్తల్‌లో ‘భారత్‌ జోడో యాత్ర’ తెలుగు పాటను ఆయన విడుదల చేశారు. జోడోయాత్ర దాదాపు మూడో వంతు పూర్తయిందని జైరాం రమేశ్ తెలిపారు.

ఈ నెల 31న శంషాబాద్‌లో రాహల్‌ మీడియాతో మాట్లాడతారని జైరాం రమేశ్ వెల్లడించారు. జోడో యాత్ర ప్రభను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పీసీసీ, డీసీసీ, బీసీసీ మీదే ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసం పార్టీలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని జైరాం రమేశ్​ మండిపడ్డారు. ప్రజలు చెప్పేది రాహుల్‌ వింటున్నారని.. మన్‌కీ బాత్‌లా ఆయన స్పీచ్‌ ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో భాజపాకు తెరాస, ఎంఐఎం పార్టీలు ఏజెంట్లుగా ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ విధానాలతో దేశం నష్టపోతోందని జైరాం రమేశ్‌ విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటుంది.. ఆర్థిక అసమానతలు పెరిగాయని.. విభజించు-పాలించు అన్న చందంగా పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలో తెరాస నియంత పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఏపీలో వైకాపా కూడా అదే తరహాలో పాలిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటుందని.. ఈ యాత్రతో రాష్ట్రంలో, దేశంలో కీలక రాజకీయ మార్పులు తథ్యమని జైరాం రమేశ్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ లేనిదే విపక్షాల ఐక్యత సాధ్యం కాదన్నారు. భాజపాను ఎదుర్కోవాలంటే ఎవరైనా కాంగ్రెస్‌తో కలవాల్సిందేనని చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details