ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకుంటేనే గుణాత్మక అభివృద్ధి చెందినట్లని నారాయణపేట కలెక్టర్ వెంకట్రావ్ అన్నారు. నర్వ మండలం సీపూర్ గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా ప్రకటించారు. ములుగు జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి స్వగ్రామమైన సీపూర్ను కలెక్టర్ వెంకట్రావ్ దత్తత తీసుకొని రెండు నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఊరిలో వందశాతం మరుగుదొడ్లు ఉంటే 70శాతం రోగాలు దూరమైనట్లేనని ఆయన అన్నారు. గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ నెలఖరున ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
మలమూత్ర నిషేధిత గ్రామంగా సిపూర్ - narva mandal
నారాయణపేట జిల్లా సీపూర్ను బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా కలెక్టర్ వెంకట్రావ్ ప్రకటించారు. ఈ నెలాఖరున ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మలమూత్ర నిషేధిత గ్రామంగా సిపూర్