నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం పెద్ద జట్రం గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఐజా తిమ్మారెడ్డి అనే వ్యక్తికి చెందిన నకిలీ పత్తి విత్తనాలు 83 ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.77,190 ఉంటుందని పోలీసులు తెలిపారు.
నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు - Fake Seeds Seized latest news
రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్న అక్రమార్కులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుంటున్నారు. నారాయణపేటలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి నుంచి రూ.1,13,190 విలువ గల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు
అలాగే 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 36,000 ఉంటుందని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.