తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో నారాయణపేట విద్యుత్ సబ్స్టేషన్ స్పాట్ బిల్లర్స్కు విద్యుత్ శాఖ సిబ్బంది నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
మీటర్ రీడింగ్ బిల్లర్స్కు విద్యుత్ శాఖ తరఫున సాయం - narayanapeta district
నారాయణపేట జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ స్పాట్ బిల్లర్స్కు విద్యుత్ శాఖ సిబ్బంది కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. సుమారు 80 మంది ప్రైవేట్ విద్యుత్ సిబ్బందికి సరుకులు అందజేశారు.
స్పాట్ బిల్లర్స్కు సరుకులు అందజేత
మీటర్ రీడింగ్ తీసే స్పాట్ బిల్లర్స్కు లాక్డౌన్ కారణంగా ఇంటింటికీ వెళ్ళి మీటర్ రీడింగ్ తీసే పరిస్థితి లేక వారికి జీతాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో సుమారు 80 మంది ప్రైవేట్ విద్యుత్ సిబ్బందికి విద్యుత్ శాఖ సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక ఆపరేషన్ డీఈ చంద్రమౌళితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.