తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో మొసలి.. భయాందోళనలో గ్రామస్థులు - నారాయణపేట జిల్లా తాజా వార్తలు

ఓ మొసలి చెరువులోకి చేరి స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. నారాయణపేట జిల్లా యాంకి చెరువులోకి చేరిన మొసలి మత్స్యకారులు వదిలి చేపలను తింటుందని.. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Crocodile in the pond at yanki in narayanapeta district
చెరువులో మొసలి.. భయాందోళనలో గ్రామస్థులు

By

Published : Jan 19, 2021, 11:44 AM IST

నారాయణపేట జిల్లా నర్వ మండలం యాంకి గ్రామంలోని చెరువులో మొసలి కలకలం రేపుతోంది. గత నెల రోజుల నుంచి చెరువులో మొసలి కనిపిస్తోందని.. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. రిజర్వాయర్ నీటి ద్వారా మొసలి చెరువులోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు.

ఇటీవల చేపల సంఘం సొసైటీ ఆధ్వర్యంలో చెరువులోకి చేపలను వదిలారని... మొసలి చెరువులో వదిలిన చేపలను తింటుందని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చెరువులో కనిపించిన మొసలిని పట్టుకొని నదిలోకి వదలాలని కోరుతున్నారు.

చెరువులో మొసలి.. భయాందోళనలో గ్రామస్థులు

ఇదీ చదవండి:సాంకేతికతతో అధిగ దిగుబడులు : శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details