నారాయణపేట జిల్లా మక్తల్లో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద తహసీల్దార్ శ్రీనివాసులు ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరురాలు ఐలమ్మ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
మక్తల్లో చాకలి ఐలమ్మ వర్ధంతి
నారాయణపేట జిల్లా మక్తల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న మక్తల్ వాసులు