' మున్సిపల్ ఎన్నికల్లో భాజపా సత్తా చాటుతాం' - narayanapet
తెరాకు ప్రత్యామ్నాయం భాజపానేనని జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
' మున్సిపల్ ఎన్నికల్లో భాజపా సత్తా చాటుతాం'
నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని పేరాల శేఖర్ ఎద్దేవా చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలో భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.