నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలుడు శనివారం సాయంత్రం సంగంబండ కెనాల్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. రెండు రోజులుగా గాలించినా ఫలితం లేకపోయింది. అయితే ఈరోజు ఉదయం కాలువ వెంబడి బాలుడి పెదనాన్న వెతుకుతుండగా ముళ్లపొదల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దింతో అక్కడకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది సాయంతో బాలుడి శవాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గల్లంతైన మృతదేహం ముళ్లపొదల్లో లభ్యం - లభ్యం
రెండు రోజుల క్రితం కాలువలో గల్లంతైన మృతదేహం.. ఈ రోజు ముళ్లపొదల్లో లభ్యమైంది. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
గల్లంతైన మృతదేహం ముళ్లపొదల్లో లభ్యం