ఓటర్ల రాక కోసం ఎదురు చూస్తున్న అధికారులు - voters
అధిక ఉష్ణోగ్రత వల్ల చాలా మంది ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండ తీవ్రత వల్ల కొన్ని చోట్లు ఓటర్ల రాకకై అధికారులు ఎదురు చూస్తున్నారు.
ఓటర్లకై ఎదురు చూపులు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పలు గ్రామాలలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఉదయం వేళల్లోనే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. వివిధ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఓటర్లకై ఎదురుచూస్తున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక... ఓటర్లు బయటికి రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశముంది.