దిశ హత్యాచారం నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి చింతకుంట కుర్మయ్య పరిస్థితి విషమంగా ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ సబ్స్టేషన్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని చింతకుంట కుర్మయ్య ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించమని వైద్యులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు... పరిస్థితి విషమం - దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు
నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌ను ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిశా కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు... పరిస్థితి విషమం