తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామంలోకి జింకలు... అటవీ అధికారులకు అప్పగించిన ఎస్సై - narayanapet news in telugu

అడవి నుంచి దారితప్పి గ్రామంలోకి వచ్చిన రెండు జింకలను నారాయణపేట జిల్లా నర్వ ఎస్సై నవీద్​... అటవీ శాఖ అధికారులను అప్పగించారు. ఒక జింకను కుక్కలు వెంటాడుతుండగా... ఎస్సై నవీద్​ కాపాడి చికిత్స చేయించారు. మరో జింక గ్రామానికి చెందిన మరో యువకుని కంటపడగా... పోలీస్​స్టేషన్​లో అప్పగించాడు.

2 Deers caught in narva village
2 Deers caught in narva village

By

Published : Jul 7, 2020, 12:25 PM IST

నారాయణ పేట జిల్లా నర్వ గ్రామ శివారులో కనిపించిన రెండు జింకలను ఎస్సై నవీద్​ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. రాజుపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో ఎస్సై నవీద్ వాకింగ్​కు వెళ్లగా... ఓ పొలంలో కుక్కలు జింకను వెంటాడటం గమనించారు. వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను తరిమేశారు. జింకను పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చి చికిత్స చేయించారు.

అనంతరం మరొక జింక దారితప్పి నర్వ శివార్లలోకి రాగా... బోయ శివ అనే వ్యక్తి దాన్ని పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా.... రెండు జింకలను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details