తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2021, 10:31 PM IST

ETV Bharat / state

YS SHARMILA: హుజూరాబాద్ ఫలితం.. తెరాసకు ఓ గుణపాఠం: వైఎస్​ షర్మిల

హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS SHARMILA)విమర్శించారు. గెలుపు కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినపుడే ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో నిరుద్యోగ దీక్ష నిర్వహించారు.

YSRTP president YS Sharmila
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

ఎన్నికలు ఉంటేనే సీఎం కేసీఆర్ బయటకు వస్తారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS SHARMILA) విమర్శించారు. హుజూరాబాద్​ ప్రజలు తెరాసకు సరైన గుణపాఠం చెప్పారని ఆమె అన్నారు. దళితబంధు పథకం అమలు చేస్తామని చెప్పినా కూడా ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం నాడు చేపట్టే నిరుద్యోగ నిరాహారదీక్షను నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడ్ గేట్ వద్ద నిర్వహించారు.

తెరాస అభ్యర్థి గెలుపు కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని షర్మిల ఆరోపించారు. ఎప్పుడు వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యే సీఎం ఎన్నికలు వస్తేనే బయట కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఉన్నత చదువులు చదివినా యువకులంతా ఉద్యోగాల్లేక పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నారని వైఎస్​ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేనో రోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రేపు యథావిధిగా చింతపల్లి మండలంలోని పల్లెల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.

ఇదీ చూడండి:

Etela Rajender win: 'ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన పోరులో ఆత్మగౌరవమే గెలిచింది'

ABOUT THE AUTHOR

...view details