నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలో వివేకానంద, నెహ్రూ యువజన సంఘాల ఆధ్వర్యంలో యోగా వారోత్సవాలు నిర్వహించారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గంట రాజశేఖర్ తెలిపారు. రోజూ యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగు పడుతుందని మండల ఆర్ఎస్ఎస్ శాఖ అధ్యక్షుడు గుండా లక్ష్మయ్య తెలిపారు.
ఈ నెల 21 వరకు యోగా వారోత్సవాలు - నల్గొండ
ఈనెల 21 న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు తెలిపారు. ప్రతి రోజు ఉదయం యోగా శిక్షణ తరగతులుంటాయన్నారు.
ఈ నెల 21 వరకు యోగా వారోత్సవాలు