సమాజంలో మహిళలందరూ జాగృతమై.. తోటి మహిళలకు జ్ఞానన్ని పెంపొందించాలని నల్గొండ జడ్జి ఎం.రమేశ్ కోరారు. మూఢ నమ్మకాల వల్ల.. మహిళలు, చంటి పిల్లలపై హత్యలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. అదనపు ఎస్పీ నర్మదాతో కలిసి ఆయన పాల్గొన్నారు.
'మహిళలందరూ జాగృతమై.. తోటివారికి సాయపడాలి'
నల్గొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా జడ్జి ఎం.రమేశ్, అదనపు ఎస్పీ నర్మదా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
'మహిళలందరూ జాగృతమై.. తోటివారికి సాయపడాలి'
భగవంతుడు.. అందరిని సమానంగా చూస్తుంటే, మనిషి మాత్రం సమానంగా చూడలేక పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు రమేశ్. సమస్యను రూపు మాపాలంటే.. అందరూ మహిళలపై దాడులు జరగకుండా చూడాలని కోరారు.
ఇదీ చదవండి:కారణం లేకుండానే నన్ను నిందించారు: సునీత