తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2020, 1:29 PM IST

ETV Bharat / state

సులభ్​ కాంప్లెక్స్​ వివాదం.. చిరువ్యాపారి దుకాణం కూల్చివేత

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పాత బస్టాండ్ ఏరియాలో ఉన్న ఓ చిరు వ్యాపారి షాపును నోటీసులు ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు కూల్చి వేశారని బాధితులు ఆందోళన చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆ దుకాణం కూల్చేశారంటూ కాంగ్రెస్​ పార్టీ నాయకులు ఆరోపించారు.

without notice the small shop demolished to construct sulabh complex at miryalaguda in nalgonda
సులభ్​ కాంప్లెక్స్​ నిర్మాణ వివాదం.. చిరువ్యాపారి దుకాణం కూల్చివేత

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పాత బస్టాండ్​లో సులభ్​ కాంప్లెక్స్ నిర్మాణం ఆందోళనకు దారి తీసింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సులభ్​ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాత బస్టాండ్​లో చిరు వ్యాపారం నిర్వహించుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి షాపుని తొలగించి అక్కడ సులభ్​ కాంప్లెక్స్​ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేశారు.

కాగా మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్​పర్సన్ అనుచరుడి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున అతను పోటీ చేసినందున కక్ష సాధింపు చర్యల్లో భాగంగా షాపును కూల్చివేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాగా పాత బస్టాండ్​లో కూతవేటు దూరంలోనే సులభ్ కాంప్లెక్స్ ఉందని.. అక్కడే ఇంకొకటి కట్టాలని చూడడం రాజకీయకక్ష సాధింపు చర్యలేనని బాధితులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి :'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'

ABOUT THE AUTHOR

...view details