తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంపులో ఏది సంక్షేమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులపై శీతకన్ను వేసింది. భూములు కోల్పోయిన గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిపేయడం వల్ల మూలిగేనక్కపై తాటిపండు పడినట్టు అయింది.

ఏది సంక్షేమం

By

Published : Feb 24, 2019, 10:58 PM IST

Updated : Feb 24, 2019, 11:28 PM IST

ఏది సంక్షేమం

నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం ప్రాజెక్టు 11.96 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దీనివల్ల చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండా, నర్శిరెడ్డిగూడెం గ్రామాల వారు నిర్వాసితులవుతున్నారు.
సంక్షేమానికి దూరంగా
ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం భూములు తీసుకోవడంవల్ల ఆయా ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలుకావడం లేదు. మరుగుదొడ్లు, కొత్త రేషన్ కార్డులు, బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు. కేవలం చౌక ధరల దుకాణాల ద్వారా కిలో బియ్యం తప్ప మరేమీ అందడంలేదు.గ్రామాల్లో ఉపాధి లభించక స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది.
కొత్త పంచాయతీ వరామా..శాపమా..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసే క్రమంలో ముంపు ప్రాంతాల్లోని వెంకేపల్లిని నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించింది. కొత్త పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు, సంక్షేమ, అభివృద్ధి పనులు ఈ గ్రామానికి అందని ద్రాక్షలా మారాయి.

Last Updated : Feb 24, 2019, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details