నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని గాంధీ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 1650 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలక్రమంలో ప్రాజెక్టు మట్టితో పుడుకుపోయింది. అన్నదాతల విన్నపంతో ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వ గత ఏడాది జూన్లో 9.9 7కోట్ల నిధులు మంజూరు చేసింది.
నిధులు కేటాయించినా
ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లోనే సాంకేతిక అనుమతుల కోసం అంటూ చిన్న నీటిపారుదల శాఖ అధికారులు హడావుడి చేసి ప్రాజెక్టును పరిశీలించి వెళ్లారు. కానీ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల పనులకు మోక్షం లభించలేదు. ప్రాజెక్టుకు పూర్వవైభవం వస్తుందని... రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందని ఆశ పడ్డ అన్నదాతలకు నిరాశే మిగిలింది.