నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ప్రధాన పార్టీలన్ని సిద్ధమయ్యాయి. పార్టీలన్ని ప్రచారంలో తలమునకలై ఉండగా.. గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. నియోజకవర్గపరిధిలోని గోడలపై, బడ్డీ కొట్లపై అంటించిన గోడపత్రికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎవరు ఏం చేశారు అని కాంగ్రెస్, తెరాస, భాజపా పార్టీల పేర్లు అంటించి ఉన్నాయి.
సాగర్ నియోజకవర్గంలో గోడపత్రికల కలకలం - nagarjuna sagar by election campaign
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై ఉండగా.. నియోజకవర్గపరిధిలో గోడలపై వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సాగర్ నియోజకవర్గంలో విద్యా, వైద్యం, విద్యుత్ సదుపాయాలు ఎవరు కల్పించారని ఈ గోడపత్రికల్లో ముద్రించారు.
గోడపత్రికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక
సాగర్ నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యం, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు ఎవరు కల్పించారని పోస్టర్లలో ముద్రించి ప్రశ్నించారు. ఉపఎన్నిక నామినేషన్ల చివరి రోజైన నేడు ఈ పోస్టర్లు అతికించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్లు ఎవరంటించారన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది.