తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు మరువలేనివి' - నల్గొండ జిల్లా తాజా వార్తలు

ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను సత్యరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని... తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో తెలంగాణ వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం హెచ్​1 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్​, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Tungaturthi MLA Gadari Kishore attends Telangana Medical and Public Health Employees Association meeting in haliaya
త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: గాదరి కిశోర్​

By

Published : Jan 28, 2021, 7:36 PM IST

రాష్ట్రంలో ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సత్యరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని... తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో తెలంగాణ వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం హెచ్​1 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్​, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రెండవ ఏఎన్ఎంలకు ఇచ్చే రూ.7వేల వేతనాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు తెరాస ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోనూ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రజల కోసం ముందుండి పోరాడిన సిబ్బంది సేవలను కొనియాడారు.

ఇదీ చదవండి: బాటసింగారంలో లాజిస్టిక్‌ పార్క్​ను ప్రారంభించిన కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details