తెలంగాణ

telangana

మునుగోడులోనూ హుజూర్​నగర్​, నాగార్జునసాగర్ సీన్ రిపీట్: కవిత

By

Published : Aug 10, 2022, 4:24 PM IST

Kavitha on Munugodu: మునుగోడు ఉపఎన్నికల్లోనూ తెరాసదే విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మార్గనిర్దేశకంగా నిలుస్తుందన్న ఆమె మునుగోడులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని చెప్పారు. కేంద్రంలోని భాజపా చేస్తున్న 'బ్యాక్‌డోర్‌' రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. బిహార్‌ పరిణామాల మాదిరిగానే.. మునుగోడు ఉపఎన్నిక సైతం వారికి సమాధానం చెప్తుందన్నారు.

Kavitha on Munugodu
ఎమ్మెల్సీ కల్వకుంట కవిత

Kavitha on Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాసనే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా అంటేనే తెరాసకు కంచుకోటని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హుజూర్​నగర్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో తెరాస హేమాహేమీలను ఓడించిందని గుర్తు చేశారు. మునుగోడులో మా ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి అగలేదన్నారు. కరోనాలో సంక్షేమ పథకాలు ఆపలేదని కవిత స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ దోమలగూడలోని భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మోడల్‌ హైస్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో కవిత పాల్గొన్నారు.

మునుగోడులో ఉపఎన్నిక వస్త ఉన్నది. నల్గొండ జిల్లా తెరాసకు కంచుకోట. ఎందుకంటే గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో మేమే గెలిచాం. హుజూర్​నగర్, నాగార్జునసాగర్​ సీన్ మునుగోడులో రిపీట్ అవుద్ది. రెండోసారి అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. భాజపా నాయకులు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి మంచిది కాదు.

- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

MLC kavitha: కరోనా కాలంలోనూ పెన్షన్లు ఎక్కడ ఆపకుండా ప్రజలకి అందించామని కవిత తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడపటంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు ముందుంటారని పేర్కొన్నారు. బిహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తోందన్నారు. బిహార్​లో ఏక పక్ష నిర్ణయాలు భాజపాకు మంచిది కాదన్నారు. భాజపా తెర వెనుక రాజకీయాలు చేస్తోందని... ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని హితవు పలికారు. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుందని కవిత స్పష్టం చేశారు.

మునుగోడులోనూ హుజూర్​నగర్​, నాగార్జునసాగర్ సీన్ రిపీట్: కవిత

ఇవీ చదవండి:మునుగోడు సీటు కూసుకుంట్లకు వద్దు.. తెరాసలో బయటపడ్డ విభేదాలు

నీతీశ్​ దెబ్బకు భాజపాకు కొత్త కష్టాలు.. కీలకంగా వైకాపా!

ABOUT THE AUTHOR

...view details