దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో లేనటువంటి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్దులకు, వికలాంగులకు పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పమడుగు గ్రామంలో సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే బాల్కసుమన్, తెరాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే తెరాస ప్రధాన లక్ష్యం: మంత్రి తలసాని
ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే బాల్కసుమన్, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
సాగర్ ప్రచారంలో తెరాస నేతలు
రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తలసాని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని పట్టించుకోని జానారెడ్డి ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. నాగర్జున సాగర్ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే తెరాస అభ్యర్థి నోముల భగత్‌నే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం : బండి సంజయ్