నల్గొండ జిల్లా దేవరకొండలో తెరాస నాయకులు రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, తెరాస ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో తెరాస కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
భాజపా మోసం చేసింది
తెలంగాణ ఏర్పడిన వెంటనే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి భాజపా మోసం చేసిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. దేవరకొండను కరువు ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెరాస రోడ్‌షోలో భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఇదీ చదవండి :'మెదక్‌తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'