నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో అధికార తెరాస... డబ్బులు, మద్యం పంచుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నికల పరిశీలన అధికారిని కలిసి వివరించారు. కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా అధిక సంఖ్యలో వాహనాలకు అనుమతి ఇస్తున్నారని పేర్కొన్నారు.
'తెరాస డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ గెలవాలని చూస్తుంది' - uttam kumar reddy comment on trs
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార తెరాస కేవలం డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ గెలవాలని చూస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిబంధనలు పాటించకుండా తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల పరిశీలన అధికారిని కలిసి పరిస్థితిని వివరించారు.
గిరిజనులు తమ సమస్యలను పరిష్కరించాలని గత సభలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆ రోజు సభలో ప్రజలను కుక్కలతో పోల్చిన విషయం సాగర్ ప్రజలు మర్చిపోలేదని ఉత్తమ్ అన్నారు. నాగర్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందని విమర్శించారు. అధిక మొత్తంలో మద్యం, డబ్బు పంచుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదీ చూడండి :భాజపా సరికొత్త పంథా.. విపక్షాలకు భిన్నంగా ప్రచారం