నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కంబాలపల్లికి చెందిన ఏడుకొండలు పశువులను మేపడానికి నల్లమల్ల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి సమయంలో తిరిగి వస్తున్న క్రమంలో ఎలుగుబంటి దాడిచేసింది. సమీపంలో ఉన్న రైతులు కేకలు వేయడం వల్ల ఎలుగు పరారైంది. ఎలమలమంద గ్రామంలో ఇంటిబయట నిద్రిస్తున్న రేఖ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడం వల్ల గాయాలయ్యాయి. ఎలుగు సంచారంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి గాయాలు - ఎలుగుబంటి దాడి
నల్గొండ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. వైద్యం కోసం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.
ఎలుగుబంటి దాడి