నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ను హై కోర్టు న్యాయమూర్తులు వారి కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. జస్టిస్ రామచంద్ర రావు, జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం రాత్రి విజయ్ విహార్‌కు చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శనివారం ఉదయం లాంచీ స్టేషన్‌కు చేరుకుని అటవీశాఖ ప్రత్యేక లాంచీలో సరదా ట్రిప్పులో సాగర్ జలాశయానికి వెళ్లారు.
సాగర్‌ను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు - nagarjuna sagar news
నాగార్జున సాగర్‌ను హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబసమేతంగా సందర్శించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతానికి వెళ్లారు.
హైకోర్టు న్యాయమూర్తులు, సాగర్
అనంతరం నాగార్జునసాగర్ డ్యాం, క్రస్ట్ గేట్లు, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. వారికి సాగర్ టూరిస్ట్ గైడ్ సత్యనారాయణ పర్యాటక ప్రదేశాల విశేషాలు వివరించారు. న్యాయమూర్తుల బృందం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, బుద్ధవనంలో పర్యటించింది. వారి వెంట రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఇదీ చదవండి:సౌకర్యాల లేమితో వనదేవతల చిన్న జాతరలు.. భక్తుల అవస్థలు.!