నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మర్రిగూడెంకు చెందిన రమేష్.. 9 ఏళ్ల క్రితం తాటి చెట్టు పైనుంచి పడి కాళ్ళు, వెన్నుముక విరిగాయి. అప్పటి నుంచి మంచానికి పరిమితమయ్యాడు. ఏమి చేయలేని స్థితిలో ఉన్న రమేష్‌కు అతని భార్య లక్ష్మీ అన్ని తానై చూసుకుంటుంది. కట్టుకున్న భార్యే... కన్న తల్లిలా సాకుతుంది.
మోటార్ సైకిల్ సహాయంతో:
సాగు చేసుకోవటానికి భూమి ఉన్నా.. పొలం దగ్గరికి వెళ్లలేని పరిస్థితి వారిది. రమేష్‌కు ముగ్గురు ఆడపిల్లలు. ఇళ్లు గడవటమే కష్టంగా ఉన్న రమేష్‌కు.. పిల్లలను చదివించటం భారంగా మారింది. ఇంట్లో ఉన్న మగ దిక్కు మంచం పట్టటంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. భార్య లక్ష్మీ కూడా భర్తను చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటుంది. సొంత పనుల కోసం బయటికి వెళ్లాలంటే రమేష్‌కు ఇబ్బందిగా ఉండటంతో 70 వేల రూపాయాలు అప్పు చేసి మోటర్ సైకిల్ కొనుకున్నాడు. తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మరో 20 వేలు ఖర్చయింది. ఉన్న ఊళ్లో స్థలం లేక వ్యవసాయ భూమి వద్దే చిన్నపాటి ఇళ్లు కట్టుకుని ఊరికి దూరంగా ఉంటున్నారీ దంపతులు.
9ఏళ్లుగా దీన స్థితిలో: