తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరు గంటలకు దుకాణాలు మూయాల్సిందే' - lock down rules

నల్గొండలో దుకాణాలు తెరుచుకున్నాయి. సరి, బేసి పద్ధతిలో 50 శాతం దుకాణాలు తెరిచారు. ఉదయం 10 గంటలకు తీసిన దుకాణాలు యాథావిధిగా సాయంత్రం 6 గంటలకు మూసేయాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.

shops open in nalgonda city in order of odd and even numbers
'ఆరు గంటలకు దుకాణాలు మూయాల్సిందే'

By

Published : May 7, 2020, 3:23 PM IST

ప్రభుత్వం ఇచ్చిన సడలింపు మేరకు మున్సిపల్ శాఖ కేటాయించిన సంఖ్యల ఆధారంగా నల్గొండ పట్టణంలో సరి, బేసి సంఖ్యల ఆధారంగా దుకాణలు తీశారు. కొనుగోలు దారులు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ... అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు.

పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ.. పరిస్థితిని పర్యవేక్షించారు. దాదాపుగా అన్ని దుకాణాలు ఉదయం 10 గంటలకే తెరుచుకున్నాయి. దుకాణాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరిచారు. సాయంత్రం ఆరు కాగానే యథావిధిగా దుకాణాలు మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను భేఖాతారు చేసినట్లయితే అట్టి దుకాణాన్ని సీజ్​ చేసి.. యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ABOUT THE AUTHOR

...view details