నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం ఇళ్లపై రాళ్లు విసురుకుంటూ, నాటు బాంబులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవకు రెండు పార్టీల నాయకుల మధ్య జరిగిన స్వల్ప వాగ్వాదమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనాలు, మూడు ఇళ్లను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 144సెక్షన్ విధించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
నాటు బాంబులతో దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు - vivadam
రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడి రాళ్లు, నాటుబాంబులతో పరస్పరం దాడి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా నాయకుని తండాలో చోటుచేసుకుంది.
నాటు బాంబులతో దాడి