ఎగువనుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో నాగార్జునసాగర్ కళకళలాడుతోంది. రెండు రోజులగా ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఇన్‌ప్లో 8 లక్షల 39 వేల 627 క్యూసెక్కులుగా ఉంది. 5 లక్షల 98 వేల 294 క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 579.90 అడుగులు కాగా నీటి నిల్వ 282.7264 టీఎంసీలుగా ఉంది. గరిష్ఠ నీటినిల్వ 312 టీఎంసీలు. 26 గేట్ల నుంచి కిందకు దూకుతున్న కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.
సాగర్‌కు స్థిరంగా కొనసాగుతున్న ప్రవాహం - నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ ఇవాళ గరిష్ఠస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 8లక్షల 39 వేల 627 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. 312 టీఎంసీల గరిష్ఠ నీటినిల్వకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 282 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రవాహం ఉన్నందున పులిచింతలకు, ప్రకాశం బరాజ్‌కు నీటిని వదులుతున్నారు.
సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల