తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్డీవో కార్యాలయం ముందు కాషాయ దళం అరెస్ట్' - Nalgonda Bjp news today

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు విఫలయత్నం చేసింది. గేటు ముందు కాషాయ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

'ఆర్డీవో కార్యాలయం ముందు కాషాయ దళం అరెస్ట్'
'ఆర్డీవో కార్యాలయం ముందు కాషాయ దళం అరెస్ట్'

By

Published : Sep 17, 2020, 2:54 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసేందుకు విఫలయత్నం చేశారు.

దేశానికి స్వేచ్ఛ వచ్చినప్పటికీ...

ఈ క్రమంలో కాషాయ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని... కానీ హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోతుండేదని భాజపా నేతలు గుర్తు చేశారు.

13 నెలల అనంతరం..

సాయుధ పోరాటాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య వల్ల స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనం అయిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని కాషాయ శ్రేణులు డిమాండ్ చేశాయి.

ఇవీ చూడండి : పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై ఐఎంఏ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details