నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లికి చెందిన జైపాల్ రెడ్డి కుటుంబంతో హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. దేవరకొండ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డి... నిన్న జరిగిన కార్మికుల సమ్మెలో పాల్గొన్నాడు. సమ్మె ముగిశాక.. ఇంటికి చేరుకున్న జైపాల్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు.
జైపాల్‌రెడ్డి మృతదేహంతో కార్మికుల ఆందోళన - telangana rtc employees strike 2019
నల్గొండ జిల్లా దేవరకొండలో గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం అంత్యక్రియల కోసం హైదరాబాద్ తరలించారు.
నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
జైపాల్‌రెడ్డి మృతదేహాన్ని దేవరకొండ డిపో ముందు ఉంచి కుటుంబ సభ్యులు, కార్మికులు ధర్నా చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించగా... కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
మృతదేహంతో స్థానికి డిపో నుంచి కొండల్రావు బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్ తరలించారు.
- ఇదీ చూడండి : పెను విషాదం... ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం