రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెంది ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద జరిగింది. కట్టంగూర్ నుంచి నకిరేకల్ వెళ్తున్న ఆటోను... స్కార్పియో వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నల్గొండ మండలం బొల్లెపల్లికి చెందిన సైదమ్మ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కట్టంగూర్‌లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - road accident in nalgonda
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
కట్టంగూర్‌లో రోడ్డు ప్రమదం... ఒకరు మృతి