నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ సమీపంలో పత్తి కూలీలతో వెళ్తున్న టాటా ఎస్ వాహనం టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్కు తరలించారు. బాధితులది గువ్వలగుట్ట తాండ. పత్తి కూలీకోసం గువ్వలగుట్ట నుంచి నెరడుగొమ్ము వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 45 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది.
టాటా ఎస్ వాహనం బోల్తా.. 30 మందికి గాయాలు - టాటా ఎస్ వాహనం బోల్తా
టాటాఎస్ వాహనం బోల్తా పడి 30 మందికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లా పెద్దమునిగల్ సమీపంలో జరిగింది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మందిని హైదరాబాద్కు తరలించారు.
టాటా ఎస్ వాహనం బోల్తా