నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న రాజవరం మేజర్ కాలువను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విశ్రాంత ఇంజినీర్ల బృందం సందర్శించింది. కాల్వ చివరన ఉన్న భూములకు సాగుకు నీరు ఎందుకు అందడం లేదనే విషయాన్ని అధికారులు పరిశీలించారు.
రాజవరం మేజర్ కాల్వను పరిశీలించిన విశ్రాంత ఇంజినీర్ల బృందం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న రాజవరం మేజర్ కాలువను విశ్రాంత ఇంజినీర్ల బృందం సందర్శించింది. రాజవరం కాల్వపై చివరన ఉన్న భూములకు సాగు నీరు ఎందుకు అందడంలేదో అధికారులు పరిశీలించారు.
రాజవరం మేజర్ కాల్వను పరిశీలించిన విశ్రాంత ఇంజినీర్ల బృందం
సాగర్ మేజర్ ఆయకట్టున 1200 ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. ప్రస్తుతం సాగు విస్తీర్ణం పెరగడం వల్ల రైతాంగం విద్యుత్ మోటార్లతో మేజర్ కాలువ సాగునీరు తరలిస్తున్నారు. అందువల్లే చివరి భూముల్లో రైతులకు నీరు అందడం లేదని అధికారులు కనుగొన్నారు. దీనిపై విశ్రాంత ఇంజినీర్ల బృందం ఓ నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్కు అందజేయనున్నారు.