నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ 4 క్రస్ట్ గేట్లను మాత్రమే 10 అడగుల మేరకు ఎత్తి స్పిల్ వే ద్వారా 59 వేల 736 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం 589.60 అడుగుల మేర..

నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడగుల మేర నీటి నిల్వ ఉంది. సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.84 టీఎంసీల వద్ద నిల్వ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాగర్‌కు 1,27,781 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా.. సమారు లక్ష క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా దిగువకు వెళ్తోంది.
ఇవీ చూడండి : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు