నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో తిరు కల్యాణం వైభవోపేతంగా సాగింది. సీతారామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఊరంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఎదురుకోళ్ళు, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు... ఇలా అన్ని ఘట్టాల్లోనూ సీతారాముల్ని కీర్తిస్తూ.. స్తుతిస్తూ సాగే కీర్తనలు... ఆలాపనలు.. భక్తులను ఎంతగానో కట్టిపడేశాయి. జానకీరాముల పరిణయాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
కన్నుల పండువగా తిరుకల్యాణోత్సవం - sita
నుదుటున మణిబాసికం, పారాణితో సిగ్గులొలికే సీతమ్మ. కస్తూరి నామం, దివ్యతేజస్సుతో వెలిగే నీలిమేఘ శ్యాముడు రామయ్య. సీతారాముల పెళ్లిపీటలపై ఆశీనులైన వేళ ఆ ఊరంతా భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. చూసిన ప్రతి తనువు పులకించింది.
కన్నుల పండువగా తిరుకల్యాణోత్సవం