నల్గొండ జిల్లా హుజూర్ నగర్‌లోని శ్రీ వేణుగోపాల సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో రామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న వూరే వరలక్ష్మి గారి వంశస్థులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఈవో గుజ్జుల కొండారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు.
ఈ ఆలయాన్ని 1100 సంవత్సర కాలంలో కాకతీయులు రాతితో నిర్మించారని ఆలయ అర్చకుడు తెలిపారు. సంతానం లేని వారు భక్తితో కొలిస్తే స్వామి సంతానం ప్రసాదిస్తాడని అన్నారు.
హుజూర్‌నగర్‌లో ఘనంగా సీతారామ కల్యాణం - శ్రీరామ నవమి వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని పురాతన వేణుగోపాల సీతారామంజనేయ స్వామి ఆలయంలో రామయ్య కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
రామయ్య కల్యాణం
ఇదీ చదవండి : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం