సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్గొండలో బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన సభ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెస్ ఛార్జీలను పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విదేశీ విద్యకు దరఖాస్తు చేసే ప్రతి విద్యార్థికి నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంబీబీస్ విద్యార్థులకు కూడా విదేశీ విద్య పథకం అమలుచేయాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
'దరఖాస్తు చేసిన వారందరికి విదేశీ విద్య అమలుచేయాలి' - bc students
నల్గొండలో బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
'దరఖాస్తు చేసిన వారందరికి విదేశీ విద్య అమలుచేయాలి'