తెలంగాణ

telangana

ETV Bharat / state

వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద పకడ్బందీగా లాక్​డౌన్ - lock down in telangana 2021

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద లాక్​డౌన్​ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి అత్యవసరంగా వచ్చే వాహనదారుల వద్ద అనుమతి పత్రాలు ఉంటేనే రాష్ట్రంలోని అనుమతిస్తున్నారు.

vadapalli check post, lock down in nalgonda
వాడపల్లి చెక్​పోస్ట్, నల్గొండలో లాక్​డౌన్

By

Published : May 14, 2021, 11:15 AM IST

నల్గొండ జిల్లా దారమచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద లాక్​డౌన్​ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉదయం 10 గంటల తర్వాత నుంచి లాక్​డౌన్ అమలవుతుండగా.. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత లాక్​డౌన్ ఉంది.

ఈ క్రమంలో ఏపీ నుంచి రాష్ట్రానికి చాలా వాహనాలు వస్తుండటం వల్ల చెక్​పోస్ట్ వద్ద రద్దీ కనపడుతోంది. అత్యవసరంగా రాష్ట్రానికి వచ్చే వాహనదారుల వద్ద అనుమతి పత్రాలుంటేనే తెలంగాణలోనికి పోలీసులు అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details