తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల ఆందోళనపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది' - Nalgonda District Latest News

మిర్యాలగూడ రైల్వే స్టేషన్​లో రైల్ రోకోకు యత్నించిన వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్టేషన్​కు తరలించడంతో ఠాణా ముందే ధర్నాకు దిగారు. రైతుకు మద్ధతుగా ఉద్యమిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

Police have arrested a leftist leader who tried to Rail Rokho at Miryalaguda railway station
రైల్ రోఖోకు యత్నించిన వామపక్ష నేతల అరెస్ట్

By

Published : Feb 18, 2021, 3:28 PM IST

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని దిల్లీలో రైతులు గత 70 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. చట్టాలు అమలైతే కార్పొరేట్ శక్తులు అన్నదాతల వద్ద తక్కువ ధరకు పంట కొని వాటిని ఎక్కువకు అమ్ముతారని ఆరోపించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్​లో రైల్ రోకోకు యత్నించిన వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్టేషన్​కు తరలించడంతో ఠాణా ముందే జూలకంటి ధర్నాకు దిగారు. రైతుకు మద్ధతుగా ఉద్యమిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ రైతుల సమస్యే కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరిదన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులు లబోదిబోమంటున్నారని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలు అమలైతే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు బతకలేని పరిస్థితి వస్తుందని విమర్శించారు. చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత: ఉత్తమ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details