రోహిణి కార్తీ ప్రవేశంతో పెరిగిన ఉష్ణోగ్రతలు - nalgonda
రోహిణి కార్తీ ప్రవేశంతో నల్లగొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు.
పెరిగిన ఉష్ణోగ్రతలు
నల్గొండలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బయటకు రావలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే చిట్యాలలోని జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారిపోయింది. ఎండ వేడిని తాళలేక జనం శీతల పానీయాలు సేవిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.