తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్కడే ఆపి ఉంటే... వచ్చే వాళ్లం కాదుగా'

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్​ వద్ద పలు వాహనాలను పోలీసులు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

people protest at vadapally checkpost as police stopped them from going due to lock down
'అక్కడే ఆపి ఉంటే... వచ్చే వాళ్లం కాదుగా'

By

Published : Mar 23, 2020, 12:05 PM IST

Updated : Mar 23, 2020, 1:20 PM IST

'అక్కడే ఆపి ఉంటే... వచ్చే వాళ్లం కాదుగా'

కరోనా వ్యాప్తి నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్​డౌన్​ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలు నిలువరిస్తున్నారు.

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి చెక్​పోస్టు వద్ద పలు వాహనాలను పోలీసులు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్​ నుంచి బయలుదేరామని, అక్కడే ఆపి ఉంటే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చాక ఆపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

బంధువు చనిపోతే వెళ్తున్నామని కొందరు, సెలవులు ఇవ్వడం వల్ల స్వగ్రామాలకు వెళ్తున్నామని మరికొందరు పోలీసులు చెప్పారు. హైదరాబాద్​లోనే తమను ఆపి ఉంటే ఇక్కడి వరకూ రాకపోయి ఉండే వారమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్న వారి వివరాలు ఆరా తీసి వారిని మాత్రమే పంపించారు.

Last Updated : Mar 23, 2020, 1:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details