నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాక్ డౌన్ వేళ భాజపా ఆధ్వర్యంలో 300 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. కూరగాయల పంపిణీ ప్రారంభమైన కొద్ది సేపటికే కార్మికులు భౌతిక దూరం మరచి గుంపులు గుంపులుగా రావడం వల్ల పంపిణీ కార్యక్రమం ఒకింత ఇబ్బందిగా మారింది.
మిర్యాలగూడలో భౌతిక దూరం మరిచి గుమిగూడిన ప్రజలు
మిర్యాలగూడలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఇబ్బందిగా మారింది. కార్మికులు భౌతిక దూరం మరిచి గుంపులుగా వచ్చారు. లాక్డౌన్ వేళ పలు దాతృత్వ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని భాజపా నాయకులు కోరారు. లేకుంటే కొవిడ్ మహమ్మారిని నియంత్రించలేమని తెలిపారు.
మిర్యాలగూడలో భౌతిక దూరం మరిచి గుమిగూడిన ప్రజలు
లాక్డౌన్ కొనసాగుతున్నందున దాతృత్వ కార్యక్రమాలు చేపట్టినప్పుడు భౌతిక దూరం పాటించాలని నాయకులు కోరారు. అప్పుడే కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు.
ఇవీ చూడండి:టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు